• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టిడిపియే సమస్యలన్నింటికీ కారణం: వైయస్‌

By Staff
|
హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ ఆలోచనాసరళి వల్లనే ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని లాల్‌ బహదూర్‌ స్టేడియంలో జరిగిన పునరంకిత సభలో ఆయన ఆదివారంనాడు ప్రసంగించారు. ఓట్లను ఏదో విధంగా సంపాదించుకోవడమే ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ ఆలోచనా సరళి అని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేయడమే ఆయన తన ప్రసంగంలో పనిగా పెట్టుకున్నారు. తెలుగుదేశంపార్టీ పేరు చెప్పకుండా ప్రాంతీయ పార్టీ అంటూ ఆయన విమర్శల వర్షం కురిపించారు. తెలుగుదేశం పార్టీ విధానం అవకాశవాదమేనని ఆయన అన్నారు. ప్రజలను మోసగించి ఓట్లు సంపాదించుకోవడమే తెలుగుదేశం పార్టీ ఆలోచనా సరళి అని ఆయన వ్యాఖ్యానించారు. సామాన్యుల జీవితాలు, బడుగు, బలహీనవర్గాల సంక్షేమం తెలుగుదేశం పార్టీ తన తొమ్మిదేళ్ల పాలన విస్మరించిందని ఆయన అన్నారు.

ఓట్లు వస్తాయనుకుంటే మతతత్వ పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ వాజ్‌పేయి ప్రతిష్ట తగ్గిందని భావించగానే ఆ పార్టీని వదిలిపెట్టడానికి వెనుకాడలేదని, ఇది తెలుగుదేశం పార్టీ అవకాశవాదానికి నిదర్శనమని ఆయన అన్నారు. మనం చేసే మంచిపనుల వల్ల తెలుగుదేశం పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఎనలేని విశ్వాసం ఉందని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తాము అప్రమత్తంగా మెలగాల్సిన అవసరం ఉందని ఆయన కార్యకర్తలకు ఉద్భోదించారు. స్థానికంగానే పంచాయతీ ఎన్నికల్లో సర్దుబాట్లు ఉంటాయని, అభ్యర్థుల ఎంపిక వరకే అభిప్రాయభేదాలు ఉండాలని, అభ్యర్థి ఎంపిక తర్వాత కలిసి కట్టుగా పని చేయడం అవసరమని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీని మట్టి కరిపించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more