• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డిప్యూటీ జైలర్‌ శ్రీనివాస నాయక్‌ సస్పెన్షన్‌

By Staff
|

హైదరాబాద్‌: జైలులోని ఖైదీలతో కుమ్మక్కయి సెటిల్‌మెంట్‌ వ్యవహారాలు నడుపుతున్నారనే ఆరోపణపై హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలు డిప్యూటీ జైలర్‌ శ్రీనివాస్‌ నాయక్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. చర్లపల్లి జైలులో ఉన్న జూలకంటి శ్రీనివాస రెడ్డి, తదితర ఖైదీలు సెటిల్‌మెంట్లు చేసేందుకు శ్రీనివాస నాయక్‌ సహకరిస్తున్న వైనాన్ని ఒక తెలుగు ప్రైవేట్‌ టీవీ ఛానల్‌ బయట పెట్టింది. ఈ వ్యవహారంపై శ్రీనివాస నాయక్‌ను సస్పెండ్‌ చేసినట్లు హోం మంత్రి కె. జానారెడ్డి మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

శ్రీనివాస నాయక్‌ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని జైళ్ల శాఖ డిజి ఆర్‌.పి. సింహ్‌ను హోం మంత్రి జానారెడ్డి ఆదేశించారు. ఈ వ్యవహారానికి సహకరిస్తున్నవారందరిపై విచారణ జరిపిస్తామని ఆయన చెప్పారు. చర్లపల్లి జైలు వ్యవహారం నేపథ్యంలో రాష్ట్రంలోని ఇతర జైళ్ల పరిస్థితిని కూడా సమీక్షించనున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X