• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలుగుకు ప్రాచీన హోదాకు కృషి: ప్రధాని

By Staff
|

న్యూఢిల్లీ: తెలుగుకు ప్రాచీన భాష హోదా కల్పించడానికి తాను శాయశక్తులా కృషి చేస్తానని ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ హామీ ఇచ్చినట్లు ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఎం. సత్యనారాయణ రావు చెప్పారు. సత్యనారాయణరావు నేతృత్వంలో రాష్ట్ర పార్లమెంటు సభ్యుల బృందం ప్రధానిని కలిసి తెలుగు ప్రాచీన భాషా హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానితో భేటీ అనంతరం సత్యనారాయణ రావు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

తెలుగు ప్రాచీన భాష హోదా లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుకు ప్రాచీన హోదా ఇవ్వడానికి అవసరమైన సాక్ష్యాధారాలను తాము ప్రధానికి సమర్పించినట్లు ఆయన తెలిపారు. శక్తివంతమైన ప్రతినిధి బృందం వచ్చిందని ప్రధాని వ్యాఖ్యానించారని ఆయన చెప్పారు. ఇంతకు ముందటి ప్రతినిధి బృందంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) లేదని, ఇప్పుడు తెరాస కూడా కలిసి వచ్చిందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X