వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైన్యం ఏర్పాటు చేస్తాననలేదు: చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: పార్టీకి సంబంధించి తాను సైన్యాన్ని ఏర్పాటు చేస్తానని అనలేదని, ప్రతి కార్యకర్త కూడా సైనికుడిలా పని చేయాలని మాత్రమేనని అన్నానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వివరణ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ జాగరణ సేన (టిజెయస్‌)లా తాను సైన్యం ఏర్పాటు చేసుకుంటామని తాను అనలేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తాము టిజెయస్‌ తరహాలో సైన్యాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పినట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి.

అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందినవారు దౌర్జన్యాలకు పాల్పడుతూ తమ పార్టీ కార్యకర్తలను హత్య చేస్తున్నారని, దీన్ని అడ్డుకోవడానికి కార్యకర్తలకు పార్టీ నాయకులు ధైర్యం ఇవ్వాలని, ప్రతి ఒక్కరూ సైనికుడిలా పని చేయాలని మాత్రమే తాను అన్నానని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర కోసం తాను కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తానని కూడా అనలేదని చంద్రబాబు వివరణ ఇచ్చారు. సమైక్యాంధ్ర కోసం ఇతరులు పని చేస్తారు, తాము కూడా పని చేస్తామని మాత్రమే అన్నానని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X