వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరంగల్‌ రోడ్డుపై గొడ్డలితో ఉన్మాది వీరంగం

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: వరంగల్‌ నగరంలో జాతీయ రహదారిపై ఒక ఉన్మాది బుధవారంనాడు వీరంగం సృష్టించాడు. గొడ్డలి పట్టుకుని గంటకు పైగా వీరంగం చేస్తూ ప్రయాణికులను భయబ్రాంతులను చేశాడు. ప్రయాణికులు పలువురు ఈ దాడిలో గాయపడి ఎంజియం ఆస్పత్రిలో చేరారు. అంతసేపు అతని వీరంగాన్ని ఆపేవారే లేకపోయారు. పోలీసులు కూడా అక్కడి రాలేదు.

గుడిసెలు వేసుకుని ఉంటూ చిత్తుకాగితాలు ఏరుకునేవారి మధ్య చెలరేగిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ గొడవ మధ్యనే ఉన్మాది గొడ్డలి చేటబట్టుకుని వరంగల్‌ జాతీయ రహదారిపై ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు. అతని ధాటికి ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని తప్పుకునే ప్రయత్నం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X