వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీర్ఘకాలిక ఉద్యమంతోనే తెలంగాణ బిజెపి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం దీర్ఘకాలిక ఉద్యమం తప్పదని, అందుకు బిజెపి సిద్ధంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ లక్ష్మణ్‌ శనివారం ఇక్కడ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌కు, టిఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో యుపిఎ భాగస్వామ్య పక్షాల్లో ఐక్యత లేదని ప్రణబ్‌ ముఖర్జీ స్పష్టం చేసిన నేపధ్యంలో చంద్రశేఖరరావు తన ప్రతిస్పందనను తెలియజేయాలని లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. కెసిఆర్‌, నరేంద్రలు అమాయకులైన తెలంగాణ ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రెండేళ్ళుగా కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌లు తెలంగాణ విషయంలో ఏం చేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X