వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కల్ల: సిపిఐ

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కల్ల అని, ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి భ్రమల నుంచి బయటపడడం మంచిదని సిపిఐ రాష్ట్ర శాఖ కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణ ప్రాంతం అనే దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోనందువల్లనే ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌కు ప్రాణం వచ్చిందని, అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం సాధ్యమయ్యేది కాదని ఆయన అన్నారు. రెండేళ్ళ పాటు కేంద్ర కేబినెట్‌లో ఉన్న చంద్రశేఖరరావు ఇప్పటికే తెలంగాణకు అనేక అభివృద్ధి పథకాలను తెచ్చి ఉండాల్సిందని నారాయణ అభిప్రాయపడ్డారు. తెలంగాణ అభివృద్ధి కోసం టిఆర్‌ఎస్‌ కమ్యూనిస్టులతో కలిసి పనిచేయాలని ఆయన కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X