• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విశాఖ ఉక్కుకు మినీరత్న హోదా

By Staff
|

విశాఖపట్నం: విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వం మినీరత్న హోదాను ఇచ్చింది. విశాఖ ఉక్కు కర్మాగారం విస్తరణ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇక్కడికి విచ్చేసిన సందర్భంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. విశాఖ ఉక్కు విస్తరణ కార్యక్రమాన్ని 2008అక్టోబర్‌లో పూర్తి చేస్తామని, ఈ కార్యక్రమానికి 8,600 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని విశాఖ ఉక్కు కర్మాగారం సిఎండి శివసాగర రావు చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాజశేఖరెడ్డి మాట్లాడుతూ విశాఖ ఉక్కు విస్తరణ వల్ల 60 వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఆయన చెప్పారు. ఛత్తిస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సొంతగనులను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X