• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ట్రాఫిక్‌ పోలీసుల నిర్వాకం: మోసిన్‌ మృతి

By Staff
|

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ట్రాఫిక్‌ పోలీసుల నిర్వాకంతో గాయపడిన మోసిన్‌ అనే యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. ఖైరతాబాద్‌లో ట్రాఫిక్‌ పోలీసుల నిర్వాకానికి షరీఫ్‌ అనే వ్యక్తి మరణించగా, మోసిన్‌ అనే యువకుడు గాయపడ్డాడు. మోసిన్‌ను హైదరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చేర్చారు. అతను కేర్‌ అస్పత్రిలో మరణించాడు. షరీఫ్‌ కుటుంబానికి రాష్ట్ర సమాచార పౌర సంబంధాల మంత్రి షబ్బీర్‌ అలీ 2 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని అందజేశారు.

మోసిన్‌ కుటుంబానికి కూడా ఆయన రెండు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని అందించారు. మైనారిటీ సంక్షేమ శాఖ నుంచి మోసిన్‌ కుటుంబానికి రుణసదుపాయం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌ నగర పోలీసు కమీషనర్‌ మహంతి అన్ని విధాలా విఫలమయ్యారని మజ్లీస్‌ శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ విమర్శించారు. మహంతిని వెంటనే బదిలీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించిన సంఘటనలో అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ చర్య తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X