• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డిసిసి అధ్యక్షులు క్షమాపణ చెప్పాలి: తెరాస

By Staff
|

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమం జరగడం లేదని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ ఇవ్వడం నిజమైతే వెంటనే క్షమాపణ చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్షం నాయకుడు విజయరామారావు ఏడుగురు జిల్లా కాంగ్రెస్‌ కమిటీల (డిసిసిల) అధ్యక్షులు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై కాంగ్రెస్‌ అధిష్ఠానం వివరణ ఇవ్వకపోతే వచ్చే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపై పునరాలోచన చేస్తామని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ ఉద్యమం లేదని ఆ ఏడుగురు డిసిసి అధ్యక్షులు బహిరంగ సభల మీదకి వచ్చి చెప్పాలని ఆయన సవాల్‌ చేశారు. ఆ ఏడుగురు డిసిసిల అధ్యక్షులపై చర్య తీసుకోవాలని తెరాస శాసనసభ్యుడు నాయని నర్సింహారెడ్డి కాంగ్రెస్‌ అధిష్ఠానవర్గాన్ని డిమాండ్‌ చేశారు. డిసిసిల అధ్యక్షులు అలా ప్రకటించిన తర్వాత తాము కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని సాధించిందేమిటని ఆయన ప్రశ్నించారు.

అయితే మరో వైపు తెరాస పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధపడుతోంది. పొత్తుపై కాంగ్రెస్‌ నాయకత్వంతో చర్చించే బాధ్యతను తమ నేత నరేంద్రకు అప్పగించింది. తమకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీపై పూర్తి నమ్మకం ఉందని నాయని నర్సింహారెడ్డి అన్నారు. తమకు ఎన్నికల్లో విజయం ముఖ్యం కాదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ముఖ్యమని ఆయన అన్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించి తీరుతామని ఆయన చెప్పారు. తెరాసతో పొత్తు వుంటుందని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర రెడ్డి తిరుపతిలో ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X