వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా నుంచి తిరిగొచ్చిన ఆర్తి: నటనకు సిద్ధం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్రముఖ సినీ నటి ఆర్తి అగర్వాల్‌ తిరిగి సినిమాల్లో నటించనుంది. ఇంటి మెట్లపై నుంచి జారిపడడంతో ఆర్తి అగర్వాల్‌కు ఇటీవల తీవ్ర గాయాలయ్యాయి. ఆ గాయాలకు ఆమె హైదరాబాద్‌లో శస్త్రచికిత్స చేయించుకుంది. ఆ తర్వాత ఆమె అమెరికా వెళ్లిపోయింది. ఆ సమయానికి ఆమె సునీల్‌ హీరోగా నటిస్తున్న అందాల రాముడు సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాకు సంబంధించి రెండు పాటల చిత్రీకరణ జరగాల్సి ఉండింది. ఆ సమయంలో ఆర్తి అగర్వాల్‌కు ప్రమాదం జరిగింది. దాంతో అందాల రాముడు సినిమా మధ్యలో ఆగిపోయింది. ఆమె అమెరికా నుంచి తిరిగి వచ్చి అందాల రాముడు చిత్రం పూర్తి చేసేందుకు సిద్ధపడింది. దీంతో ఆ చిత్ర నిర్మాత వాకాడ అప్పారావుకు ఊరట లభిస్తుందనడంలో సందేహం లేదు.మూడు నెలల పాటు ఆమె సినీ రంగానికి దూరంగా ఉంది. నటనకు దూరంగా ఉండడం తనకు ఎంతో బాధ కలిగించిందని, అభిమానుల ప్రోత్సాహంతో తిరిగి నటించాలని అనుకుంటున్నానని ఆమె చెప్పింది. రేపటి నుంచి కేరళలో జరిగే అందాల రాముడు సినిమా షూటింగ్‌లో ఆమె పాల్గొంటుంది. అందాల రాముడు సినిమా యూనిట్‌ తనకెంతో సహకరించిందని ఆమె చెప్పింది. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని ఆర్తి అగర్వాల్‌ చెప్పింది.

నువ్వు నాకు నచ్చావ్‌ చిత్రంతో ఆర్తి అగర్వాల్‌ తెలుగు సినీ రంగంలో ప్రవేశించింది. బాలకృష్ణ. చిరంజీవి వంటి అగ్ర హీరోల పక్కన కూడా ఆమె నటించింది. అయితే వివాదాలు ఆమెకు ఎప్పటికప్పుడు కష్టాలు తెచ్చి పెడుతున్నాయి. ఒక యువ హీరోతో ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టడంతో ఆర్తి అగర్వాల్‌ గతంలో ఒకసారి ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఆ తర్వాత ఇంట్లో మెట్లపై నుంచి జారిపడిన సంఘటన కూడా ఆమె విషయంలో పెద్ద దుమారమే చెలరేగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X