• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సమ్మె విరమణ: అయితే నిరసన కొనసాగింపు

By Staff
|

న్యూఢిల్లీ: ఉన్నత విద్యాసంస్థల్లో ఒబిసి కోటాకు వ్యతిరేకంగా చేపట్టిన సమ్మెను వైద్య విద్యార్థులు విరమించారు. దీంతో వైద్య కళాశాలల్లోని, ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రెసిడెంట్‌ డాక్టర్లు విధుల్లో గురువారంనాడు విధుల్లో చేరారు. అయితే తమ నిరసన మాత్రం కొనసాగుతుందని వైద్య విద్యార్థులు చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలను మన్నించి తాము విధుల్లో చేరుతున్నట్లు వారు చెప్పారు.

గత 20 రోజులుగా దెబ్బ తిన్న ఒపిడి సేవలు గురువారంనాడు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ఐదు ప్రధాన వైద్య కళాశాలల్లోనూ, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ తిరిగి సాధారాణ పరిస్థితులు నెలకొంటున్నాయి. రేపటిలోగా సాధారణ పరిస్థితులు నెలకొనగలవని ఆరోగ్య శాఖ మంత్రి అంబుమని రాందాస్‌ చెప్పారు. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ( ఎయిమ్స్‌), మౌలానా ఆజాద్‌ మెడికల్‌ కాలేజీ, లేడీ హార్డింజ్‌ మెడికల్‌ కాలేజీ, యూనివర్శిటీ కాలేజ్‌ ఆఫ్‌ మెడికల్‌ కాలేజీ, వర్ధమాన్‌ మహావీర్‌ మెడికల్‌ కాలేజీల జూనియర్‌ డాక్టర్లు సమ్మె విరమించి విధుల్లో చేరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X