వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్టీయే ఆఫీసులో అగ్నిప్రమాదం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌లో గల ఆర్టీయే కార్యాలయం అగ్నిప్రమాదానికి గురైంది. శుక్రవారం అర్థరాత్రి సుమారు 2-30 గంటల సమయంలో ఆర్టీయే కార్యాలయం రెండో అంతస్థులో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికులు వెంటనే ఫైర్‌ స్టేషన్‌కు, పోలీస్‌ స్టేషన్లకు సమాచారం అందించారు. సకాలంలోనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. విషయం తెలియగానే నగర పోలీసు అదనపు కమిషనర్‌ వీఆర్‌కె మోహనరావు, రవాణా సంయుక్త వెంకటేశ్వర్లు, పంజగుట్ట ఎసిపి గోపాలరాజు తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌వల్లే ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. ఒక కంప్యూటర్‌, కొంత ఫర్నీచర్‌ తప్ప పెద్దగా నష్టమేమీ జరగలేదని అధికారులు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X