వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నగరంలో వానాకాలం భద్రతా చర్యలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఒక పెద్ద వర్షం కురిస్తే చాలు అల్లకల్లోలంగా మారే హైదరాబాద్‌ నగరంలో ఈసారి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ సంజయ్‌ జాజు చొరవ కారణంగా ఈ వర్షాకాలంలో నగర వాసుల సమస్యలు తగ్గనున్నాయి. వర్షం పడినప్పుడు నీరు నిలిచిపోయి ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ఒక పక్కా ప్రణాళికను రూపొందించినట్టు సంజయ్‌ శనివారం హైదరాబాద్‌ జిల్లా ఇంచార్జి మంత్రి షబ్బీర్‌ అలీ నిర్వహించిన సమీక్షా సమావేశంలో వెల్లడించారు. వర్షాకాలం మ్యాన్‌హోల్స్‌లో జనం పడకుండా చర్యలు తీసుకున్నట్టు వాటర్‌ వర్క్స్‌ ఎండీ జవహర్‌ రెడ్డి చెప్పారు. ఏదైనా ప్రమాదం జరిగితే తక్షణం స్పందించడానికి 14 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X