వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాహుల్ మహాజన్ కేసు: సాహిల్ లొంగుబాటు
శ్రీనగర్: ప్రమోద్ మహాజన్ తనయుడు రాహుల్ మహాజన్‌పై హత్యా యత్నం కేసులో నాలుగో నిందితుడు సాహిల్ జారూ శనివారం సాయంత్రం శ్రీనగర్‌లో లొంగిపోయాడు. రాహుల్‌కు డ్రగ్స్ తెచ్చి ఇచ్చాడన్న ఆరోపణలను సాహిల్ ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం తన మానసిక పరిస్ధితి బాగుండలేదని, తానేమీ మాట్లాడలేనని సాహిల్ పోలీసులకు చెప్పాడు. కాగా మిగిలిన ముగ్గురు నిందితులను పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. ప్రమోద్ మహాజన్ కార్యదర్శి రమ్మని పిలిస్తేనే ఢిల్లీలోని రాహుల్ ఇంటికి వెళ్ళానని సాహిల్ చెప్పాడు. ఢిల్లీలో తనకు ఇల్లు ఉందని, తాను మాదక ద్రవ్యాలు అమ్ముకుని బతికే రకం కాదని అతను అన్నాడు.
Comments
Story first published: Saturday, June 3, 2006, 23:53 [IST]