• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పెట్రోధరల పెంపుపై ఎపిలో ఆందోళనలు

By Staff
|

హైదరాబాద్‌: పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చెలరేగింది. ప్రతిపక్ష పార్టీలు మంగళవారం రాస్తారోకోలు, ధర్నాలు, ఎడ్ల బండ్ల ప్రదర్శనలు నిర్వహించారు. శ్రీకాకుళంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఎడ్ల బండ్ల ప్రదర్శన నిర్వహంచారు. రేపటి నుంచి ఆందోళనను ఉధృతం చేయాల్సిందిగా ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వామపక్షాలతో కలిసి ఆందోళనలు చేపట్టాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. దాదాపు మూడు కిలోమీటర్ల మేరకు ఈ ప్రదర్శన సాగింది.

హైదరాబాద్‌లో ఇందరిపార్కు నుంచి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల ప్రదర్శన జరిగింది. బిజెపి, సిపిఐ, సిపియం కార్యకర్తలు ఎక్కడికక్కడ ఆందోళనలకు దిగారు. హన్మకొండలో బిజెపి కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. గత రెండేళ్లలో యుపిఎ ప్రభుత్వం ఆరు సార్లు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచిందని బిజెపి జాతీయ కార్యదర్శి బండారు దత్తాత్రేయ విమర్శించారు. బిజెపి కార్యకర్తలు ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వామపక్షాలు ఒక వైపు ప్రభుత్వాన్ని సమర్థిస్తూ మరో వైపు ఆందోళన చేపట్టడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. విశాఖపట్నం జగదాంబ జంక్షన్‌లో టిడిపి కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. కర్నూలు తెలుగుదేశం, సిపిఐ కార్యకర్తలు వినూత్న ప్రదర్శన నిర్వహించారు. ఎడ్లబండ్లకు గాడిదలను కట్టి ప్రదర్శన నిర్వహించారు. నిజామాబాద్‌ జిల్లా వేల్పూరులో రాస్తారోకో నిర్వహించారు. అన్ని జిల్లాల్లోనూ ఆందోళనలు జరిగాయి. కడపలో సిపియం కార్యకర్తలు రైల్‌రోకో నిర్వహించారు. ఆందోళనకారులు పట్టాలపై పడుకుని రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించారు. వారిని పోలీసులు బలవంతంగా తొలగించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more