• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత్‌-వెస్టిండీస్‌ మొదటి టెస్టు డ్రా

By Staff
|

అంటిగ్వా, జూన్‌ 6: భారత్‌-వెస్టిండీస్‌ తొలి టెస్ట్‌ డ్రా గా ముగిసింది. చివర్లో కొత్త బంతి తీసుకుని ప్రయత్నించినా ద్రావిడ్‌ సేనకు ఫలం దక్కలేదు. చివరికి వెస్టిండీస్‌ 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసి డ్రా కావడంతో గట్టెక్కింది. విండీస్‌ చివరి బ్యాట్స్‌మెన్‌ చక్కటి ప్రటిఘటన కనబరిచారు. చివల్లో మహ్మద్‌ అద్భుతంగా ఆడి అర్థ సెంచరీ చేసి భారత్‌ విజయాన్ని అడ్డుకున్నాడు. విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ ఎడ్వర్డ్‌, కలిమోర్‌ నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో వెటరన్‌ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లేకి 4 వికెట్లు దక్కగా, శ్రీశాంత్‌, సెహ్వాగ్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. మునాఫ్‌ పటేల్‌ ఒక తీశాడు. డబుల్‌ సెంచరీతో భారత్‌ భారీ స్కోరుకు బాటలు వేసిన భారత బ్యాట్స్‌మెన్‌ వసీం జాఫర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

వికెట్‌ నష్టపోకుండా 13 పరుగులతో మంగళవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన వెస్టిండీస్‌ తొలి సెషన్‌లో ఏకంగా మూడు వికెట్లనుకోల్పోయింది. టీ విరామ సమయానికి వెస్టిండీస్‌ 3 వికెట్లకు 158 పరుగులు సాధించింది. ఓపెనర్లు క్రిస్‌ గేల్‌-డెరెన్‌ గంగా కలిసి 67 పరుగులు జోడించాక వెస్టిండీస్‌ పతనం ప్రారంభమైంది. ఈ వికెట్‌ను కుంబ్లే తీశాడు. ఆ త ర్వాత వరుసగా మూడు ఓవర్ల తేడా తో ఏకంగా మూడు వికెట్లను కోల్పోయింది. శర్వణ్‌ (1) నిర్లక్ష్యపు షాట్‌ కొట్టి స్లిప్‌లో కుంబ్లేకు క్యాచ్‌ ఇచ్చి అ వుటయ్యాడు. తర్వాత వెస్టిండీస్‌సారథి బ్రియాన్‌ లారా (0)ను శ్రీశాంత్‌ ఎల్‌బిడబ్ల్యు చేశాడు. లంచ్‌ విరామ సమయానికి వెస్టిండీస్‌ 30.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X