• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పెట్రో ధరలు తగ్గించే వరకు ఆందోళన: బాబు

By Staff
|

విశాఖపట్నం: పెట్రో ధరల పెంపును నిరసిస్తూ పార్లమెంటు వెలుపలా, లోపలా పోరాటం చేస్తామని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చెప్పారు. పెట్రో ధరల పెంపును తగ్గింపజేసే విషయంలో ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర రెడ్డికి గానీ, కాంగ్రెస్‌ నాయకులకు గానీ చిత్తశుద్ధి లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రంగాల్లో విఫలమయ్యాయని ఆయన విమర్శించారు.

పంచాయతీ ఎన్నికల్లో సిపియంతో పొత్తులు స్థానికంగానే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో స్థానిక పొత్తుల విషయంలో ఢిల్లీ సిపియం నాయకులతో మాట్లాడారా అని ప్రశ్నించడం ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అజ్ఞానానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీ అభ్యర్థుల ఎంపిక జిల్లా, మండల స్థాయిల్లో జరుగుతుందని ఆయన చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో యువతకు 35 శాతం సీట్లు కేటాయిస్తామని ఆయన చెప్పారు. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోమని ఆయన అన్నారు. ఎన్నికలు వాయిదా వేయాలని తాము కోరుకోవడం లేదని, ప్రభుత్వ అక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో మూడో ప్రత్యామ్నాయం ఊహాజనితమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X