• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాంగ్రెస్‌ ఉచ్చులో తెరాస: దత్తాత్రేయ

By Staff
|

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఉచ్చులో పడిపోయి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) బలహీనపడిందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్‌ నాయకుడు బండారు దత్తాత్రేయ అన్నారు. పార్టీ అగ్రనేత నరేంద్ర సమక్షంలోనే తెరాస నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీలో చేరడమే అందుకు నిదర్శనమని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు.

పంచాయతీ ఎన్నికల్లో పొత్తులపై ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో చర్చలు జరుపుతున్న కాంగ్రెస్‌ నాయకులు ఆచరణలో తెరాసను పొమ్మనలేక పొగ పెడుతున్నారని ఆయన అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఇతర పార్టీలకు ధీటుగా తమ ప్రచారం ఉంటుందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X