వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇరాక్‌లో ఆల్ ఖైదా నేత జర్కావీ హతం
బాగ్దాద్: ఇరాక్‌లోని ఆల్ ఖైదా నాయకుడు అబు ముసాబ్ అల్ - జర్కావీ సంకీర్ణ దళాల బాంబు దాడుల్లో మరణించినట్లు ఇరాక్ ప్రధాని నూరి అల్ మాలికి ప్రకటించారు. రాజధానికి 65 కిలోమీటర్ల ఉత్తరాన ఉన్న బాఖూబా నగరంలో జరిగిన దాడిలో జర్కావీతో పాటు అతని సహచరులు ఏడుగురు మరణించినట్లు ఇరాఖియా టెలివిజన్ తెలియజేసింది. జర్కావీ అమెరికా సంకీర్ణ దళాలపై పోరాటం చేస్తూ వస్తున్నాడు. ఏడాది క్రితం అతను ఒక వీడియో రికార్డింగ్‌లో దర్శనమిచ్చాడు. ఇతను జోర్డాన్‌లో జన్మించాడు.
Comments
Story first published: Thursday, June 8, 2006, 23:53 [IST]