వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్‌ కేసు: సాహిల్‌ ఇంట్లో పోలీసు సోదాలు

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: రాహుల్‌ మహాజన్‌ మాదక ద్రవ్యాల దుర్వినియోగం కేసులో నిందితుడైన సాహిల్‌ జారూ ఇంటిలో ఢిల్లీ పోలీసులు శుక్రవారంనాడు సోదాలు నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్‌ పోలీసుల సహకారంతో ఢిల్లీ పోలీసులు ఈ సోదాలు చేశారు. ఢిల్లీలోని ప్రమోద్‌ మహాజన్‌ ఇంటిలో విందు జరిగినప్పుడు సాహిల్‌ వేసుకున్న దుస్తుల కోసం పోలీసులు అన్వేషణ జరిపినట్లు సమాచారం.

ప్రమోద్‌ మహాజన్‌ నివాసంలో జరిగిన విందులో సాహిల్‌ పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విందులో మద్యం సేవించి, మాదక ద్రవ్యాల తీసుకోవడంతో రాహుల్‌ మహాజన్‌ అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైతే, ప్రమోద్‌ మహాజన్‌ వ్యక్తిగత కార్యదర్శి వివేక్‌ మొయిత్రా మరణించారు. డ్రగ్స్‌ సరఫరా చేసిన నైజీరియన్లకు సాహిల్‌ ఫోన్‌ల మీద ఫోన్‌లు చేసినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో సాహిల్‌ మొబైల్‌ ఫోన్‌ కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారు. సాహిల్‌ నివాసంలో పోలీసులకు ఏ విధమైన ఆధారాలూ లభించలేదని సాహిల్‌ తండ్రి గులామ్‌ అహ్మద్‌ జారూ చెప్పారు. తన కుమారుడు అమాయకుడని ఆయన అన్నారు. తనను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించినట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X