• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టిడిపి, సిపియంలది వింతకాపురం: దత్తాత్రేయ

By Staff
|

మెదక్‌: తెలుగుదేశం, సిపియంలది వింత కాపురమని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. సిపియం బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. కాంగ్రెస్‌వైపు పోతామని తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ వైపు పోతామని కాంగ్రెస్‌ను సిపియం బ్లాక్‌మెయిల్‌ చేస్తూ వచ్చిందని ఆయన అన్నారు. ఈ విధమైన సిపియం వైఖరి దురదృష్టకరమని ఆయన అన్నారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీలో ఉన్నారో లేదో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అగ్రనాయకత్వానికి తెలియదని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల తర్వాత తెరాస ఉనికి ప్రశ్నార్థకమేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి తెలంగాణ ద్రోహిగా అభివర్ణించిన తెరాస నాయకత్వం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం విడ్డూరమని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలన్నీ అవకాశవాద పొత్తులకు దిగుతున్నాయని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X