వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విధానంగానే కాంగ్రెస్‌తో చెలిమి: సిపిఐ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: జాతీయ స్థాయి విధానంలో భాగంగానే తాము పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో చెలిమి చేస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ స్పష్టం చేశారు. ప్రస్తుత పొత్తుల నేపథ్యంలో వామపక్షాల మధ్య దూరం పెరుగుతుందని తాము అనుకోవడం లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

రాష్ట్రంలో సిపిఐ, సిపియంలు వేర్వేరు కూటముల్లో ఉండడం తమ తప్పు కాదని, ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానని ఆయన అన్నారు. తాము సీట్ల కోసమో, మరో లబ్ధి కోసమో కాంగ్రెస్‌తో పొత్తులకు సిద్ధపడలేదని, జాతీయ విధానంలో భాగంగా పొత్తుకు సిద్ధపడ్డామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X