• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎపి ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు

By Staff
|

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరాల్సిన ఎపి ఎక్స్‌ప్రెస్‌కు మంగళవారం ఉదయం బాంబు బెదిరింపు వచ్చింది. బాంబు పెట్టినట్లు వచ్చిన సమాచారం ఉత్తుత్తదేనని తేలడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఒక అధికారి ఇంటికి ఫోన్‌ వచ్చింది. ఎపి ఎక్ప్‌ప్రెస్‌లో బాంబు పెట్టినట్లు ఆగంతకులు ఫోన్‌లో చెప్పారు.

బాంబు సమాచారం అందిన వెంటనే బాంబు స్వ్వాడ్స్‌తో పాటు ఇతర భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ప్రయాణికులను దించేసి క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించాయి. బాంబు లేనట్లు తనిఖీల్లో తేలింది. అనంతరం ఎపి ఎక్ప్‌ప్రెస్‌ బయలుదేరి వెళ్లింది. ఈ బాంబు బెదిరింపుతో ఎపి ఎక్ప్‌ప్రెస్‌ రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X