వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌కు కఠారి ఈశ్వరకుమార్‌ రాజీనామా

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ: మాజీ మంత్రి కఠారి ఈశ్వర్‌కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్‌ కె. కేశవరావుకు పంపారు. తనను నిర్లక్ష్యం చేస్తున్నందుకు నిరసనగానే రాజీనామా చేసినట్లు ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తనను ఓడించినవారిని మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు.

వెనకబడిన తరగతులవారికి ఆత్మాభిమానం ఉండదని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర రెడ్డి అనుకోవడం పొరపాటని ఆయన అన్నారు. తాను రాజీనామా లేఖ పంపిన తర్వాత ముఖ్యమంత్రి తనతో ఫోన్‌లో మాట్లాడారని, తాను పరిస్థితిని వివరించానని ఆయన చెప్పారు. కేశవరావు కూడా తనతో ఫోన్‌లో మాట్లాడారని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X