వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నల్లగొండ జిల్లాలో భారీ నక్సల్స్‌ డంప్‌

By Staff
|
Google Oneindia TeluguNews

నల్లగొండ: నల్లగొండ జిల్లాలో పోలీసులు నక్సలైట్లకు చెందిన భారీ ఆయుధాల డంప్‌ను కనుక్కున్నారు. పోలీసులు ఐదు మందుపాతరలను వెలికి తీశారు. చందంపేట నుంచి తంబాలపల్లికి వెళ్లే దారిలో నక్కలగడ్డ తండా వద్ద రహదారిపై పోలీసులు ఐదు మందుపాతరలను వెలికి తీసినట్లు నల్లగొండ జిల్లా పోలీసు సూపరింటిండెంట్‌ (యస్పీ) ఎం. ఎం. భగవత్‌ మీడియా ప్రతినిధులతో చెప్పారు.

దేవరకొండ ప్రాంతంలో పోలీసులు గాలింపు జరుపుతున్న సమయంలో మందుపాతరలు కనిపించాయని ఆయన చెప్పారు. పంచాయతీ ఎన్నికలు జరగనున్న ప్రస్తుత స్థితిలో మందుపాతరలను కనుక్కోవడం ఎంతో మేలైందని ఆయన అన్నారు. మందుపాతరలను వెలికితీసిన పోలీసులకు ఆయన 25 వేల రూపాయల నగదు అవార్డు ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X