• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కృష్ణా జెడ్పీ చైర్మన్‌ టిడిపి అభ్యర్ధి కాగిత వెంకటరావు

By Staff
|

విజయవాడ: కృష్ణాజిల్లా పరిషత్‌ అధ్యక్షపదవికి తెలుగుదేశం అభ్యర్ధిగా కాగిత వెంకటరావును ఆ పార్టీ ఎంపిక చేసింది. జెడ్పీ అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి కాగిత వెంకటరావు నిన్న సాయంత్రం వరకు తటపటాయించారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు ఫోన్‌ చేసి మొదట నామినేషన్‌ దాఖలు చేసి ఆ తర్వాత తనతో మాట్లాడమని చెప్పినట్టు తెలుస్తోంది. కొనకళ్ళ నారాయణరావును జెడ్పీ అధ్యక్ష అభ్యర్ధిగా జిల్లా టిడిపి ఎంపిక చేసే అవకాశముందని, తన మద్దతు కూడా ఆయనకేనని, వ్యక్తిగత కారణాల వల్ల తాను పోటీ చేయలేకపోతున్నానని కాగిత వెంకటరావు చంద్రబాబుకు చెప్పినట్టు తెలిసింది. కానీ కొన్ని గంటల్లోనే సీన్‌ మారిపోయింది. కృష్ణా జెడ్పీ అధ్యక్ష పదవికి టిడిపి అభ్యర్ధిగా కాగిత వెంకటరావునే ఎంపిక చేసినట్టు హైదరాబాద్‌ నుంచి అధికారిక సమాచారం అందింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X