వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసు హింస తాళలేక యువకుడి ఆత్మహత్య

By Staff
|
Google Oneindia TeluguNews

విజయనగరం: విజయనగరం జిల్లా జొన్నవలస గ్రామానికి చెందిన నారాయణ రావు అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు హింసించడం వల్లనే నారాయణ రావు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి బంధువులు, జొన్నవలస గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నారాయణ రావుకు, ఆయన భార్యకు మనస్పర్ధలు ఉండడంతో భార్య పోలీసులకు మౌఖికంగా ఫిర్యాదు చేసింది. దానితో ఎస్‌పై విజయ్‌కుమార్‌ నారాయణరావును పోలీసు స్టేషన్‌కు పిలిపించి, తీవ్రంగా కొట్టినట్టు తెలుస్తోంది. ఆదివారం మళ్ళీ స్టేషన్‌కు రావాలంటూ నారాయణరావును ఎస్సై ఆదేశించారు. ఆదివారం నాడు తనకు కొట్టి చంపుతారన్న భయంతో నారాయణరావు ఆత్మహత్యకు పాల్పడినట్టు గ్రామస్తులు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X