వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేట కేసు : సల్మాన్‌పై తాజాగా అభియోగాలు

By Staff
|
Google Oneindia TeluguNews

జోధ్‌పూర్‌: కృష్ణజింకల వేట కేసులో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ మళ్లీ కష్టాల్లో పడ్డాడు. కృష్ణ జింకల వేట కేసులో సిటీ కోర్టు తాజాగా అభియోగాలు మోపింది. ఇతర నటులు సైఫ్‌ అలీఖాన్‌, టబు, సోనాలీ బింద్రే, నీలంలపై కూడా కోర్టు అభియోగాలు మోపింది.

సల్మాన్‌పై జింకలను వేటాడనే ఆరోపణపై, ఆ వేటను ప్రోత్సహించారనే ఆరోపణపై ఇతర నటులపై కోర్టులో అభియోగాలు నమోదు చేశారు. నిందితులందరూ కోర్టుకు హాజరయ్యారు. విచారణను తిరిగి జులై 3వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. గతంలో కూడా నిందితులపై అభియోగాలు మోపారు. అయితే డిఫెన్స్‌ న్యాయవాది జిల్లా, సెషన్స్‌ కోర్టులో రివ్యూ పిటిషన్‌ వేశారు. కోర్టు వారిని ఆరోపణల నుంచి తప్పించింది. దాంతో తాజాగా మళ్లీ అభియోగాలు మోపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X