• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రబాబుపై వైఎస్‌ వ్యంగ్యబాణాలు

By Sridhar L
|

హైదరాబాద్‌: ఓటర్ల జాబితాల్లో అక్రమాలు చేసినవారిపై ఎన్నికల కమిషనే చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరాధ్య దైవం గోబెల్స్‌ (అసత్య ప్రచారంలో నిష్ణాతుడు) అని వైఎస్‌ ఎద్దేవా చేశారు. ఈ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో 2004 ఎన్నికల కంటే అధికంగా ప్రజాదరణ పొందుతామని ఆయన అన్నారు. తమను విమర్శించే అంశాలు లేకపోవడంతో చంద్రబాబు నాయుడు తన నవ్వు మీద, తన నిద్ర మీద వ్యాఖ్యానాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు చెప్పింది చేయడానికి కాదని వైఎస్‌ అన్నారు. చంద్రబాబు గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అవినీతి తగ్గిందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X