• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఓటర్ల జాబితాలో అక్రమాలు నిజం: బాబు

By Staff
|

హైదరాబాద్‌: ఓటర్ల జాబితాలో అక్రమాలు ముమ్మాటికీ నిజమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. కాంగ్రెస్‌వారు దొంగవోట్లను చేర్పించి, తమ మద్దతుదారుల ఓట్లను జాబితాల నుంచి తొలగింపజేశారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో డబ్బును, మద్యాన్ని కాంగ్రెస్‌ వారు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారని ఆయన అన్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్‌ అన్ని రకాల అక్రమాలకు పాల్పడుతోందని ఆయన అన్నారు.

కొత్త చేరిన ఓటర్లు 22 వేల మంది మాత్రమేనని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర రెడ్డి అనడాన్ని ప్రస్తావిస్తూ ఆ ఓటర్ల జాబితా రాజశేఖర రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చిందని ఆయన అడిగారు. ఒక గుంటూరు జిల్లాలోనే 77,669 ఓట్లను తీసేశారని ఆయన చెప్పారు. ఓటర్ల జాబితాలో అక్రమాలకు సంబంధించి హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును ఆయన సుదీర్ఘంగా చదివి వినిపించారు. ఓటర్ల జాబితాల్లో అవకతవకలపై ముఖ్యమంత్రి తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ఓటర్లు ఫారాలు 6,7ల ద్వారా జాబితాలో నమోదుకు దరఖాస్తులు పెట్టుకున్నారని ఆయన అన్నారు. నామినేషన్ల పరిశీలనను ఒక ఫార్స్‌గా మార్చారని ఆయన అన్నారు. మంత్రులు, శాసనసభ్యులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ అక్రమాలపై, అప్రజాస్వామిక విధానాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చి పోరాడుతామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X