• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాంగ్రెస్‌ రెబెల్‌ అభ్యర్థి హత్య, ఉద్రిక్తత

By Staff
|

వరంగల్‌: వరంగల్‌ జిల్లా గూడూరు జడ్‌పిటిసి కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థి ఐలయ్యను ప్రత్యర్థులు నరికి చంపారు. ఆయన కార్యాలయంలో ఉండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో గూడూరులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గూడూరులో 144 సెక్షన్‌ విధించారు. గూడూరులో సోమవారం మధ్యాహ్నానికి పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ ఉద్రిక్తంగానే ఉంది. పొత్తులో భాగంగా గూడూరు జడ్‌పిటిసిని కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్ర సమితికి కేటాయించింది. దీంతో ఐలయ్య తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఐలయ్య హత్య మంగళవారం ఆర్థరాత్రి దాటిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలోనే జరిగింది. ఐలయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న దొంతి మాధవరెడ్డి సుబేదారి పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. అతనితో పాటు మరో ఇద్దరు కూడా లొంగిపోయారు.

ఐలయ్య హత్య వార్త విన్న వెంటనే ఆయన అనుచరులు ప్రత్యర్థుల ఇళ్లపై దాడులకు దిగారు. ఈ దాడిలో ఏడు ఇళ్ల ధ్వంసమయ్యాయి. దాడిలో గాయపడినవారిలో ఒకరి పరిస్థితి అందోళనకరంగా వుంది. పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు లాఠీచార్జి చేశారు. ఆరు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఆందోళనకారులు ఒక జీపును, బైక్‌ను దగ్ధం చేశారు. ఆందోళనకారులు చేసిన దాడిలో దుగ్గొండి సబ్‌ ఇన్‌స్పెకర్‌ తీవ్రంగా గాయపడ్డారు. నర్సంపేట సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కూడా గాయపడ్డారు. ఐలయ్య హత్య వార్త విన్న వెంటనే కాంగ్రెస్‌ నాయకులు ఎం. కోదండరెడ్డి, రెడ్యా నాయక్‌ ఇక్కడికి చేరుకున్నారు. మంత్రి పొన్నాల లక్ష్మయ్యను నర్సంపేట ఆస్పత్రిలో ఐలయ్య బంధువులు, అభిమానులు అడ్డుకున్నారు. ఐలయ్య మృతదేహానికి నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్న సమయంలో ఈ సంఘటన చేసుకుంది. చెప్పులు, చీపురుకట్టలతో మంత్రి ఐలయ్య అనుచరులు అడ్డుకున్నారు. దీంతో ఐలయ్య భౌతిక కాయాన్ని చూడకుండానే మంత్రి వెనుదిరిగారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X