• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హైదరాబాద్‌ శివార్లలో దొంగ కాల్చివేత

By Staff
|

హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివార్లలో బుధవారంనాడు పోలీసులు ఒక దొంగను కాల్చి చంపారు. తమ నుంచి తప్పించుకుని పారిపోతుండగా కాల్పులు జరపడంతో అతను మరణించినట్లు పోలీసులు చెప్పారు. హైదరాబాద్‌ శివారులోని రంగారెడ్డి జిల్లా బాటసింగారం గ్రామం వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లాలోని ఎల్‌.బి. నగర్‌లో ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కుమారుడిని కిడ్నాప్‌ చేసి కోటి రూపాయలు డిమాండ్‌ చేసిన కామేశ్వరరావును గన్నవరం నుండి పట్టుకొస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

కామేశ్వరరావు అనే రౌడీషీటర్‌ ఎల్‌.బి. నగర్‌లోని ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కుమారుడిని కిడ్నాప్‌ చేసి కోటి రూపాయలు డిమాండ్‌ చేశాడు. ఈ విషయమై ఎల్‌.బి. నగర్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఆ రౌడీ షీటర్‌కు ఇప్పటికే 50 లక్షల రూపాయలు ముట్టజెప్పినట్లు సమాచారం. వనస్థలిపురంలో నివాసం ఉండే కామేశ్వరరావును పోలీసులు మంగళవారం గన్నవరంలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తీసుకు వస్తున్నారు. బాటసింగారం సమీపంలో ఈ ఉదయం మూత్రం వస్తుందంటే దింపారు. ఆ సమయంలో కామేశ్వరరావు ఒక కానిస్టేబుల్‌ నడుముకు ఉన్న పిస్టల్‌ను లాక్కున్నాడని, కాల్పులు జరుపుతూ పారిపోయే ప్రయత్నం చేశాడని, దీంతో పోలీసులు కాల్పులు జరిపారని, కాల్పుల్లో కామేశ్వరారవు మరణించాడని పోలీసులు చెప్పారు. కామేశ్వరరావు నుంచి పోలీసులు 36 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X