వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓడిపోతామనే భయంతోనే అక్రమాలు: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్‌ పంచాయతీ ఎన్నికల్లో విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. ఎన్నికలు జరిగిన తీరు చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఉందా అనే అనుమానం కలుగుతోందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఓటర్ల జాబితాల్లో జరిగిన అక్రమాలను తాము నిరూపిస్తామని ఆయన అన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమీషన్‌ ప్రేక్షకపాత్ర వహించిందని ఆయన అన్నారు. అక్రమాలపై ఫిర్యాదు చేసిన తమను తప్పు పట్టే పద్ధతిలో ఎన్నికల కమీషన్‌ వ్యవహరించిందని ఆయన విమర్శించారు.

ఎన్నికల్లో కాంగ్రెస్‌ విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంపిణీ చేసిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, ఓటర్లను ప్రలోభపెట్టిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అన్ని వర్గాలకు అన్యాయమే చేసిందని ఆయన అన్నారు. ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత మోసం చేసిందని ఆయన అన్నారు. రైతుల ఆర్థిక పరిస్థితి ఈ రెండేళ్ల కాలంలో పూర్తిగా దిగజారిందని ఆయన అన్నారు. రైతులను కించపరిచే విధంగా కాంగ్రెస్‌ వారు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఎన్నికల వాగ్దానాలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X