వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్రమాలపై ఇసి దృష్టి పెట్టాలి: రాఘవులు

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: ఎన్నికల అక్రమాలపై ఎన్నికల కమీషన్‌ జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని సిపయం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు డిమాండ్‌ చేశారు. రెండో విడత పోలింగ్‌లో అయినా అక్రమాలకు కళ్లెం వేయడానికి ఎన్నికల కమీషన్‌ చొరవ చూపాలని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వరంగల్‌ జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో తెలుగుదేశం, సిపియంల సర్దుబాట్లు సజావుగా సాగాయని, దీంతో ఈ రెండు జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకుంటామని ఆయన అన్నారు. వరంగల్‌ జిల్లాలో తెలుగుదేశం, సిపియం చేతిలో కాంగ్రెస్‌, తెరాస కూటమి చిత్తు కావడం ఖాయమని ఆయన అన్నారు. రెండో విడత పోలింగ్‌ సందర్బంగా కాంగ్రెస్‌ మద్యం, డబ్బు విచ్చలవిడిగా పంపిణీ చేయడానికి సిద్ధపడుతోందని ఆయన ఆరోపించారు. అక్రమాలతో గెలవాలనే కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు సహించరని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X