• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కొసరాజు సిఐడి కస్టడీ పొడగింపునకు తిరస్కరణ

By Staff
|

హైదరాబాద్‌: డిపాజిటర్లను మోసగించిన కృషి బ్యాంక్‌ చైర్మన్‌ కొసరాజు వెంకటేశ్వరారవును మరిన్ని రోజులు సిఐడి కస్టడీకి అప్పగించడానికి నాంపల్లి కోర్టు నిరాకరించింది. ఈ నెల 11వ తేదీ వరకు వెంకటేశ్వరరావును తమ కస్టడీలో వుంచుకోవడానికి అనుమతించాలని సిఐడి కోర్టును కోరింది. అయితే అందుకు కోర్టు తిరస్కరించింది. శుక్రవారంనాడు వెంకటేశ్వరరావును సిఐడి పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచారు.

వెంకటేశ్వరరావుకు లై డిటెక్టర్‌ టెస్టు చేయడానికి అనుమతించాలని కోరుతూ సిఐడి పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వెంకటేశ్వరరావుకు గురువారంనాడు ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మెడ, భుజం నొప్పి వస్తుందని వెంకటేశ్వరరావు చెప్పడంతో ఈ పరీక్షలు నిర్వహించారు. స్కానింగ్‌ కూడా నిర్వహించారు. డిపాజిటర్లను ఎవరినీ తాను మోసం చేయబోనని, తన ఆస్తులన్నీ అమ్మి అయినా డిపాజిటర్ల సొమ్ము చెల్లిస్తానని అతను చెబుతున్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X