• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఖమ్మంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోం: సిపియం

By Staff
|

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవిని దక్కించుకోవడానికి తాము కాంగ్రెస్‌ మద్దతు తీసుకునే ప్రసక్తి లేదని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు తేల్చి చెప్పారు. పోటీలో ఓడిపోతే ప్రతిపక్షంలో కూర్చుంటాం తప్ప కాంగ్రెస్‌ మద్దతు తీసుకోబోమని ఆయన ఆదివారంనాడు మీడియా ప్రతినిధులతో చెప్పారు. పోటీలో గెలుస్తే గెలుస్తాం లేదంటే ప్రతిపక్షంలో కూర్చుంటామని ఆయన అన్నారు.

ఖమ్మంలో తెలుగుదేశం పార్టీతోనే వుంటామని ఆయన చెప్పారు. బలాబలాలు సమానం ఉన్నాయి కాబట్టి గెలిస్తే గెలుస్తాం లేదంటే లేదని ఆయన అన్నారు. ఓటర్ల జాబితాను సవరించకుండా గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల కమీషన్‌ విడుదల చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని హైకోర్టు కూడా వ్యాఖ్యానించిందని, ఇటువంటి స్థితిలో అక్రమాలు సవరించకుండా ఎన్నికలు నిర్వహించడం సరి కాదని ఆయన అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ విషయంలో ఎన్నికల కమీషన్‌ ఏకపక్షంగా వ్యవహరించడం సరి కాదని ఆయన అన్నారు. అఖిల పక్ష సమావేశంలో ఏర్పాటు చేసి వచ్చిన సూచనల మేరకు ఇసి చర్యలు చేపట్టడం మంచిదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X