• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మసాల ఈరన్న గెలుపుపై ప్రత్యర్థి పిటిషన్‌

By Staff
|

కర్నూలు: కర్నూలు జిల్లా ఆలూరు జడ్‌పిటిసి సభ్యుడిగా మసాల ఈరన్న గెలుపును సవాల్‌ చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఈరన్న ప్రత్యర్థి మేకల భాస్కర్‌ పిటిషన్‌ వేశారు. ఓట్ల లెక్కింపును తిరిగి చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో మేకల భాస్కర్‌ను చల్లబరిచేందుకు మసాల ఈరన్న వర్గీయులు మంతనాలు జరుపుతున్నారు.

ముందు మేకల భాస్కర్‌ గెలిచినట్లుగా ప్రకటించారు. అయితే ఆ తర్వాత 96 ఓట్లతో ఈరన్న గెలిచినట్లు తిరిగి ప్రకించారు. మసాల ఈరన్న గెలిచినట్లు ఏకపక్షంగా ప్రకటించడం విడ్డూరమని మేకల భాస్కర్‌ అంటున్నారు. ప్రభుత్వాధికారులు, మంత్రి మారెప్ప ఓట్ల కౌంటింగ్‌ ఉద్యోగులతో మాట్లాడిన తర్వాత పది నిమిషాలకు మసాల ఈరన్న గెలిచినట్లుగా ప్రకటించారని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X