వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మోనికా బేడీ జ్యుడిష్యల్ రిమాండ్ పొడిగింపు
హైదరాబాద్: నకిలీ పాస్‌పోర్టు కేసులో అండర్ వరల్డ్ డాన్ అబూ సలేం ప్రియురాలు, సినీనటి మోనికా బేడిని మంగళవారం నాంపల్లిలోని సిబిఐ కోర్టులో హాజరు పరిచారు. మోనికా బేడీ జ్యుడిష్యల్ రిమాండ్‌ను కోర్టు ఈ నెల 25వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
మోనికా బేడీ నకిలీ పాస్‌పోర్టు కేసులో కోర్టు స్పెషల్ బ్రెంచ్ ఇన్స్పెక్టర్ శివశంకర్‌ను, మరో ఇద్దరు సాక్షులను విచారించింది. కర్నూలు జిల్లాలో మోనికా బేడీ తప్పుడు చిరునామాతో నకిలీ పాస్‌పోర్టును సంపాదించి విదేశాలకు పారిపోయినట్లు అభియోగం. అబూ సలేంతో కలిసి ఆమె పారిపోయింది.
Comments
Story first published: Tuesday, July 11, 2006, 23:53 [IST]