• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మండలాధీశ ఎన్నికల్లో హింస: ఒకరి మృతి

By Staff
|
హైదరాబాద్‌: మండల పరిషత్‌ అధ్యక్ష ఎన్నికల్లో అక్కడక్కడా హింస చెలరేగింది. కొన్ని చోట్ల పోలీసులు లాఠీచార్జి చేశారు. మంగళవారం జరిగిన మండలాధీశుల ఎన్నికల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా చెలరేగిన ఘర్షణలో ఒక వ్యక్తి మరణించాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా పెద్దమందడి జిల్లా పరిషత్‌ మండల పరిషత్‌ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా జరిగిన హింసలో ఎల్లన్న అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త మరణించాడు. తెలుగుదేశం, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగి పోలీసుల లాఠీచార్జికి దారి ఒక వ్యక్తి మరణానికి కారణమైంది. ఒక స్వతంత్ర అభ్యర్థిని మూడు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీవారు తమ వైపు తిప్పుకున్నారు. మంగళవారం ఆ స్వతంత్ర అభ్యర్థితో కలిసి మండల పరిషత్‌ సమావేశానికి వస్తుండగా కాంగ్రెస్‌ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఈ సమయంలో ఘర్షణ చెలరేగింది. పోలీసులు లాఠీచార్జి చేయడంతో పారిపోయే ప్రయత్నంలో ఎల్లన్న కిందపడిపోయి మరణించాడు. కడప జిల్లా సంబేపల్లిలో నాయకులు పంపిణీ చేసిన చీప్‌ లిక్కర్‌ తాగి ఒక వ్యక్తి మరణించాడు. నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలాధ్యక్షుడి ఎన్నిక సందర్భంగా వివాదం చెలరేగి స్థాని శాసనసభ్యుడు సాంబయ్య, జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డిసిసి) అధ్యక్షుడు శేషు పరస్పరం చేయి చేసుకున్నారు. తన నియోజకవర్గంలో నీ పెత్తనమేమిటని సాంబయ్య శేషును నిలదీశారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ను కాంగ్రెస్‌ హస్తగతం చేసుకున్న తీరును నిరసిస్తూ అనంతపురంలో తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అనంతపురంలో కాంగ్రెస్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపిస్తూ కర్నూలులో తెలుగుదేశం పార్టీ శవ ప్రదర్శన నిర్వహించింది. తెలుగుదేశం నాయకుడు బండి అనంతయ్య పాడెపై చచ్చిపోయినట్లు పడుకున్నాడు. అతన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏడుస్తూ ఊరేగించారు. నల్లగొండ జిల్లా జాజిరెడ్డిగూడెంలో తెలుగుదేశం పార్టీ ఎంపిటిసి సభ్యులను కాంగ్రెస్‌ కిడ్నాప్‌ చేసిందనే ఆరోపణలతో ఘర్షణ చెలరేగింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more