• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఫీజుల పెంపుపై నిరసన: విద్యార్థులపై లాఠీచార్జి

By Staff
|

హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ కోర్సుల ఫీజులను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు బుధవారంనాడు రాష్ట్ర వ్యాప్తంగా కౌన్సెలింగ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించాయి. విద్యార్థి సంఘాల కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జెయన్‌టియు) వద్ద వామపక్ష విద్యార్థి సంఘం విద్యార్థులు ఆందోళనకు దిగారు. కౌన్సెలింగ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో గంట సేపు ఆలస్యంగా కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది.

గుంటూరు, విశాఖపట్నం, కడప, హన్మకొండల్లో కూడా ఆందోళనకారులు ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్చి చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల లాఠీచార్జిలో కొంతమంది విద్యార్థులు గాయపడ్డారు. పోలీసు జులం నశించాలంటూ విద్యార్థులు నినాదాలు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X