వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవియస్‌ రెడ్డీ! నోరు మూసుకో!!: కడియం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ ఎవియస్‌ రెడ్డి నోరు మూసుకోవడం మంచిదని తెలుగుదేశం పార్టీ నాయకుడు కడియం శ్రీహరి అన్నారు. ఎవియస్‌ రెడ్డి ఒకటి అంటే తాము పది అంటామని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎవియస్‌ రెడ్డి నోరు పారేసుకోవడం అంత మంచిది కాదని ఆయన అన్నారు. ఎవియస్‌ రెడ్డి తమ పార్టీపై చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు.

రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ ఎవియస్‌ రెడ్డి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేతిలో కీలుబొమ్మగానే వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎవియస్‌ రెడ్డి తన వైఖరి మార్చుకోవడం ఎంతైనా మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాధికారి అయిన ఎవియస్‌ రెడ్డికి ఎన్నికల కమీషన్‌ అనే వ్యవస్థకు మార్గదర్శకత్వం వహించే అవకాశం వచ్చిందని, అంత మాత్రాన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతామంటే కుదరదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X