• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దిగివచ్చిన కాంగ్రెస్‌: తెరాసతో ఒప్పందం

By Staff
|

హైదరాబాద్‌: జిల్లా పరిషత్‌ పదవులపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి, కాంగ్రెస్‌కు మధ్య బుధవారం సాయంత్రం అవగాహన కుదిరింది. ఈ అవగాహనకు సంబంధించి తెరాస, కాంగ్రెస్‌ నాయకులు చర్చల అనంతరం సంయుక్త ప్రకటన చేశాయి. నిజామాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవిని, మెదక్‌, కరీంనగర్‌, వరంగల్‌ వైస్‌ చైర్‌పర్సన్ల పదవులను తెరాసకు ఇవ్వడానికి కాంగ్రెస్‌ అంగీకరించింది. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్‌ కె. కేశవరావు ప్రతినిధులు ఎం. కోదండరెడ్డి, తదితరులు తెలంగాణ భవన్‌లో తెరాస అగ్ర నేత ఎ. నరేంద్రతో చర్చలు జరిపారు. పరస్పరం చేసుకున్న విమర్శలను ఇరు పార్టీలు మరిచిపోవాలని చర్చల అనంతరం నరేంద్ర అన్నారు. తమకు కాంగ్రెస్‌ అధిష్ఠానవర్గంపై నమ్మకం వుందని, కింది స్థాయి నాయకులతోనే సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన అన్నారు. చర్చలు సక్రమంగానే జరిగాయని పిసిసి ప్రతినిధి ఎం. కోదండరెడ్డి అన్నారు. ఇరు పార్టీల మధ్య రాతపూర్వక ఒప్పందం కుదిరింది. కాంగ్రెస్‌ మాట తప్పే పరిస్థితి ఉందనే ఉద్దేశంతో రాతపూర్వక ఒప్పందం కోసం నరేంద్ర పట్టుబట్టారు. దానికి కాంగ్రెస్‌ అంగీకరించి ఒప్పందంపై సంతకం చేసింది

నరేంద్ర తీరుపై మంగళవారం తీవ్రంగా ధ్వజమెత్తని కేశవరావు బుధవారం ఒక మెట్టు దిగివచ్చి తెరాస అగ్రనేత నరేంద్రతో చర్చలకు కోదండరెడ్డిని, యాదవరెడ్డిని పంపించారు. తాము రాష్ట్ర కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకుంటామని మంగళవారం ప్రకటించిన నరేంద్ర కూడా బుధవారం చర్చలకు సుముఖత వ్యక్తం చేశారు. నరేంద్రతో బుధవారం ఉదయం నరేంద్రతో చర్చలు జరిపారు. అయితే ఆ చర్చలు ఒక కొలిక్కి రాలేదు. కాంగ్రెస్‌ మాటపై తమకు నమ్మకం లేదని, మాటకు కట్టుబడి వుండేదే అయితే నిజామాబాద్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక, మెదక్‌ జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌ ఎన్నిక జరగకుండా ఎందుకు చేస్తుందని నరేంద్ర బుధవారం ఉదయం అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X