వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృషి వెంకటేశ్వరరావుపై మళ్ళీ పరీక్షలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కృషి సహకార బ్యాంక్‌ చైర్మన్‌ కొసరాజు వెంకటేశ్వరరావుపై సత్యశోధన (లై డిటెక్టర్‌) పరీక్షలు రెండో రోజు కూడా కొనసాగాయి. ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉన్న కొసరాజు ఇంటరాగేషన్‌లో వెల్లడించిన విషయాలు నిజమో అబద్ధమో తెలుసుకునేందుకు ఈ పరీక్షలు నిర్వహించారు. కొసరాజును నాంపల్లి కోర్టు అనుమతితో బుధవారం ఉదయం చంచల్‌గుడా జైలు నుంచి తీసుకువచ్చి సత్యశోధన పరీక్ష నిర్వహించి తిరిగి జైలుకు పంపారు. గురువారం ఉదయం మళ్ళీ పరీక్షలు జరిగాయి. ఫోరెన్సిక్‌ నిపుణులు పకడ్బందీగా రూపొందించిన ప్రశ్నావళి ఆధారంగా ఈ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు రెండు రోజుల తర్వాత వెల్లడయ్యే అవకాశముంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X