వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎన్టీఆర్ అశోక్ పైనే అందరి దృష్టి
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ నటించిన అశోక్ సినిమా నేడు గురువారం 280 ప్రింట్లతో విడుదలైంది. ఎన్టీఆర్ అభిమానుల సందడి రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్ల వద్ద కనిపిస్తోంది. సినిమా ఎలా ఉందన్న టాక్ ఇంకా బయటికి రాలేదు. అతనొక్కడే ఫేం సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన రెండో సినిమా ఇది. ఈ సినిమా నైజాం ప్రాంత హక్కులను దిల్ రాజు తీసుకున్నారు. దిల్ రాజు ఏ సినిమా హక్కులను కొనుగోలు చేసినా కనకవర్షం కురుస్తుందని సినిమా ట్రేడ్ వర్గాల నమ్మకం. ఆయన ఇటీవల పోకిరి, గోదావరి ప్రాంతీయ ప్రదర్శన హక్కులను తీసుకునారు. విదేశాల ప్రింట్లను ఇప్పటికే పంపించారు.
Comments
Story first published: Thursday, July 13, 2006, 23:53 [IST]