• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మరో ఆరుగురిని చంపిన మావోయిస్టులు

By Staff
|

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా ఎర్రబోరు గ్రామం నుంచి కిడ్నాప్‌ చేసినవారిలో ఆరుగురిని మావోయిస్టులు హత్య చేశారు. ఇందులో ఒక మహిళ కూడా ఉంది. మృతదేహాలను గగనపల్లి ।గ్రామం వద్ద పోలీసులు గుర్తించారు. దీంతో ఎర్రబోరు మారణకాండలో మరణించినవారి సంఖ్య 36కు చేరుకుంది. మావోయిస్టులు నిన్న 30 మందిని ఊచకోత కోయడంతో పాటు 40 మందిని తమ వెంట తీసికెళ్లారు. ఈ 40 మందిలో ఆరుగురిని చంపారు. మిగతా 34 మందిని వదిలిపెట్టారు.

దంతెవాడ జిల్లా ఎర్రబోరులో మావోయిస్టుల చేతిలో మరణించిన సల్వాజుడుం కార్యకర్తల అంత్యక్రియలు జరిగాయి. ప్రభుత్వ నిర్వక్ష్యం వల్లనే ఈ మారణకాండ చోటు చేసుకుందని గిరిజనులు ఉడికిపోతున్నారు. భద్రత కల్పిస్తామని పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందులో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని వారు విమర్శిస్తున్నారు. గిరిజనులు మావోయిస్టులపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. మారణాయుధాలతో మావోయిస్టుల కోసం కాచుకుని వున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X