• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ముఖర్జీలతో కాదు, సోనియాతోనే తేల్చుకుంటాం: కెసిఆర్‌

By Staff
|

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఇక ముఖర్జీలతో పని లేదని, నేరుగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతోనే తేల్చుకుంటామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖరరావు అన్నారు. వచ్చే నెల 15వ తేదీలోగా చివరి ప్రయత్నం చేస్తామని, ఆ తర్వాత సంరంభమో, సంగ్రామమో తేల్చుకుంటామని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణపై వచ్చే నెల 15వ తేదీ లోగా కాంగ్రెస్‌ విధాన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సోనియా గాంధీపై ఇంకా తనకు పూర్తి విశ్వాసం ఉందని, గత రెండేళ్లలో ఎప్పుడూ సోనియా గాంధీ తెలంగాణ వ్యతిరేక సూచనలు ఇవ్వలేదని ఆయన అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారం ఎలా చేయాలనేదే ఆలోచిస్తున్నామని సోనియా చెబుతూ వచ్చారని ఆయన అన్నారు.

తెలంగాణకు ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర రెడ్డి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాజశేఖర రెడ్డిపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. వైయస్‌ జలయజ్ఞమంతా బూటకమని, అది తెలంగాణకు అన్యాయం చేసేదేనని ఆయన అన్నారు. 610 జీవోను అమలు చేయాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకున్నా ఫలితం కనిపించలేదని ఆయన అన్నారు. తెలంగాణను వ్యతిరేకించే ఏకైక పార్టీ తెలుగుదేశం అని ఆయన అన్నారు. సిపియం, సిపిఐ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించడం లేదని ఆయన అన్నారు. బిజెపితో పాటు వామపక్షాలు మద్దతిస్తున్నందున కాంగ్రెస్‌ నాన్చుడు ధోరణిని సహించలేమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటే వ్యతిరేకించకూడదని సిపిఐ జాతీయ కౌన్సిల్‌ తీర్మానం చేసిందని ఆయన చెప్పారు. ప్రణబ్‌ ముఖర్జీ కమిటీకి రాసిన లేఖలో సిపియం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును వ్యతిరేకించలేదని ఆయన అన్నారు. తెలంగాణకు 450 మంది లోక్‌సభ సభ్యులు మద్దతిస్తున్నారని ఆయన చెప్పారు. ఆంధ్ర, తెలంగాణల మధ్య ఉద్వేగపూరిత విలీనం జరగలేదని, అందువల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవసరం ఏర్పడుతోందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X