వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిన్సినాటి ఓపెన్‌: రెండో రౌండ్‌లోకి సానియా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ టెన్నిస్‌ సంచలనం సానియా మీర్జా సిన్సినాటి ఓపెన్‌ టోర్నమెంట్‌లో రెండో రౌండ్‌కు చేరుకుంది. తొలి రౌండ్‌లో ఆమె ప్రత్యర్థి గాయం కారణంగా ఆట మధ్యలోనే తప్పుకుంది. దీంతో సానియా రెండో రౌండ్‌కు చేరుకుంది. అమెరికాకు చెందిన అలెగ్జాండ్రా స్టీవెన్సన్‌ గాయం కారణంగా తప్పుకునే సమయానికి సానియా 6-1, 2-0 స్కోర్‌తో లీడ్‌లో వుంది. తర్వాతి రౌండ్‌లో సానియా ఫిన్‌లాండ్‌కు చెందిన వరల్డ్‌ నెంబర్‌ 66 ఎమ్మా లైనేతో తలపడుతుంది.

ఇప్పటికే సానియా మీర్జా పోలెండ్‌కు చెందిన మార్టాతో కలిసి డబుల్స్‌లో రెండో రౌండ్‌కు చేరుకుంది. సానియా జోడీ తొలి రౌండ్‌లో నాటాలీ గ్రాండిన్‌, మిలగ్రోస్‌ సీక్వెరా జోడీపై 6-4, 6-3 స్కోర్‌తో విజయం సాధించింది. తొలి రౌండ్‌లో సెరినా విలియమ్స్‌ అనాస్తసియా మిష్కిన్‌పై 6-2, 6-2 స్కోర్‌తో విజయం సాధించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X