వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇ - మెయిల్‌ పంపిన యువకుడి అరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

భోపాల్‌: లష్కర్‌ - ఎ - తాహర్‌ పేరు మీద మీడియాకు ఇ - మెయిల్‌ పంపిన యువకుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ముంబాయి వరుస బాంబు పేలుళ్లకు పాల్పడింది తామేనంటూ లష్కర్‌ - ఎ - తాహర్‌ పేరు మీద ఆ యువకుడు మీడియాకు మెయిల్‌ పంపాడు. దీంతో భోపాల్‌లోని రిసాల్దార్‌ కాలనీలో నివస్తున్న ఆ యువకుడు సుమిత్‌ తమ్రాకర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ సంజీవ్‌ కుమార్‌ సింగ్‌ చెప్పారు.

సంచనం కోసమే ఆ యువకుడు మీడియాకు ఇ - మెయిల్‌ పంపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సుమిత్‌ మూడేళ్ల క్రితం 12వ తరగతి పూర్తి చేశాడు. అప్పటి నుంచి ఖాళీగానే వుంటున్నాడు. అయితే అతనికి ఏ విధమైన నేర చరిత్ర లేదని పోలీసులు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X