వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిన్సినాటి ఓపెన్: క్వార్టర్ ఫైనల్లో సానియా
న్యూఢిల్లీ: హైదరాబాద్ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా సిన్సినాటి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఇటీవలి కాలంలో సరైన ప్రతిభ కనబరచని సానియాకు ఇదొక ఊరట. సానియా మీర్జా రెండో రౌండ్లో ఫిన్లాండ్కు చెందిన తొమ్మిదో సీడ్ ఎమ్మా లైనేపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లో కాలు మోపింది.
లైనేను సానియా 6-1, 0-6, 6-1 స్కోర్‌తో ఓడించింది. క్వార్టర్ ఫైనల్లో ఆమె టాప్ సీడ్ పాటీ స్నైడర్‌ను ఎదుర్కోవాల్సి వుంది. స్విట్జర్లాండ్‌కు చెందిన స్నైడర్ అమెరికాకు చెందిన అబిగైల్ స్పియర్‌ను 6-1, 6-0 స్కోర్‌తో ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.
Comments
Story first published: Thursday, July 20, 2006, 23:53 [IST]